Thursday, December 4, 2014

యండమూరి వీరేంద్రనాథ్ కొటేషన్లు!

యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి. ఇవి కొన్ని యండమూరి వీరేంద్రనాథ్ కొటేషన్లు!

సంతృఫ్తి కోసం బ్రతకవద్దు. సంతృప్తితో బ్రతకాలి.

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వులేనప్పుడు నవ్వుని,నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.

పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.

ఎక్కడయితే  శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తాడు. 

ఎక్కడ 'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు.

ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.

ఒకరి అందం,అర్హతల వాళ్ళ మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనవల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.

ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే.

ప్రేమనీ,ఆకర్షణనీ ఏ పాయింటు దగ్గర విడగొట్టలన్నది  ఏ  ఐన్ స్టీను కనుక్కోలేదు.

ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ,అవగాహన,ఇష్టం,తాదాత్మ్యత ,స్పర్శ,కామం,ఓదార్పు. 

ప్రేమ అన్న ఒక్క అర్హతవల్లె మనిషి మిగతా జీవాల్నుంచి విడివడ్డాడు.

ప్రేమంటే సృతిమించినప్పుడు,శుష్కించినప్పుడు  ఒకేలా వుండేది.

నడుస్తుంటే దూరంగా మసక మసక వెన్నెల్లో కుప్పలా శివాలయం. ఏటి ఒడ్డున నీటీ పువ్వులాంటి జీవితాన్ని స్వప్నం నుంచి వేరు చెస్తున్నట్టూ క్షితిజరేఖ. వెలుగురేఖల్ని వెదజల్లుతూ తూర్పు ముఖాన్ని ఎరుపుచేస్తున్న ఆకాశం. ఆ నీరవంలో జంటగా పాట పాడే భరద్వాజ పక్షులు మాష్టారూ! జీవితానికెంత అందమైన విలువుందో కదూ? ఒంటరి నక్షత్రాన్ని తోడూ తేసుకుని గుడికివెళ్తూంటే గుండెల్నిండా ఓంకారమే.

చెట్టునీ, పుట్టనీ ప్రేమించలగాలి. వర్షాన్ని, మంచునీ ప్రేమించగలగాలి. మేఘమొస్తుంటే సంతోషించాలి. పువ్వు పూస్తుంటే మైమరచిపోవాలి అదీ ప్రేమంటే. విశ్వాన్ని, ప్రకృతిని, సాటి మనిషినీ ప్రేమించేవాడి మనసు నుంచి ఆనందాన్నీ, పెదవి మీద నుంచి చిరునవ్వుని బ్రహ్మకూడా చెరపలేడు.

ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!

నేను ఫోన్ చేసినప్పుడు అతడు 'హల్లో' అని సంతోషంగా అన్నడనుకో ...చూసావా! నేను దగ్గరలేకపోయినా అతడు సంతోషంగా ఉన్నాడనే ఉక్రోషం! మామూలుగా 'హల్లో' అన్నాడనుకో, నా స్వరం విన్నాక కూడా అతడిలో సంతోషంలేదని బాధ! పోనీ అతడు బాధగా 'హల్లో' అన్నాడనుకో, ఇక ఇటునుంచి నేను ఏడ్చేస్తాను. అది పబ్లిక్ టెలిఫోన్ అయినా సరే..

నా ప్రేమ స్వచ్చమైనదైతే నీవెందుకు నాకు!నీ జ్ఞాపకం చాలు! నాతో ఉండాలనుకోవటం స్వార్థం. నాప్రేమ ఎప్పుడైతే ఈ స్వార్ధాన్ని అధిగమించిందో, అది నిన్ను దాటి జాతిని, కులాన్ని రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని దాటి విశ్వవ్యాప్తమవుతుంది. అదే విశ్వజనీనమైన ప్రేమ.

ఊపిరిలోనికి వస్తున్నప్పుడు నువ్వు నాలోకి ప్రవేశిస్తున్న అనుభవమై హృదయం పొంగుతుంది. శ్వాస బయటికొస్తుంటే నువ్వు వెళ్ళిపోతున్నావన్న బాధతో కడుపుతరుక్కుపోతుంది. ఈ ఉచ్చ్వాస నిశ్వాసల్లో కూడా నీవే నిండి ఉన్నావన్న ఆనందంతో గుండె నిండుతోంది.

నా కలలకి కథావస్తువా! నీకెలా చెప్పను? నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని, నీ కనురెప్పల చప్పుళ్ళలో నాకు వేదం వినబడుతుందని.

విశ్వమంత చోటేల? నీ పక్క ఇరుకుస్థలముండగా.

నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను. నువ్వు తప్ప!

ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!

ప్రేమంటే హౄదయాన్ని పారేసుకోవడం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వునీ, నువ్వున్నప్పుడు కాలాన్ని పారేసుకోవడం.
ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమ కోల్పోతాడు. తనక్కావలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తనగురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ.

ప్రతి మొగవాడూ స్త్రీ దగ్గర ఏ వయసులోనైనా చిన్నవాడే. చిన్నపిల్లవాడు తరచూ అద్దంలో తన మొహాన్ని చూసుకోవాలని అనుకున్నట్టు, ప్రతీ పురుషుడూ తనకు స్పూర్తినిచ్చిన స్త్రీ అభినందనపూర్వకమైన చిరునవ్వులో తన విజయాన్ని చూసుకోవాలనుకుంటాడు.

వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. 

సున్నితత్వం అంటే చిన్న చిన్న విషయాలకి బాధపడటం కాదు, చిన్న చిన్న విషయాలకి ఆనందపడటం.

వేసే ప్రతి అడుగుకీ అంగుళం దూరంలో ధ్యేయాన్ని పెడతాడు దేవుడు. అందుకే స్వర్గాన్ని అంత ఎత్తులో కట్టాడు. కొందరే అక్కడికి చేరుకోగలరు. అంగలేసి అలసిపోనివాళ్ళు.

మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
కన్నీరా! క్రందకి జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!

విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
అన్ని విజయాల్లోకి గొప్పవిజయం దాన్ని ఎక్కువమంది గుర్తించడం.

కాసింత చిరునవ్వు, కాసిని కన్నీళ్ళు ..ఇదేనా వీడ్కోలు అంటే?

ShareThis

Popular Posts